Powered By Blogger

Sunday, August 28, 2011

Memory Techniques


The human brain is a 3-pound (1.4-kilogram) mass of jelly-like fats and tissues—yet it's the most complex of all known living structures. Up to one trillion nerve cells work together and coordinate the physical actions and mental processes that set humans apart from other species.


జ్ఞాపక శక్తి పెరగాలంటే... 
మంగళవారం, 2 మార్చి 2010( 16:17 IST )



వయసు పెరిగేకొద్దీ జ్ఞాపకాలు మసకబారుతాయి. దీంతో పలు ఇబ్బందులు తలెత్తుతాయి. అయినప్పటికీ భయపడాల్సిన పనిలేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీరు తీసుకునే ఆహారంలో మెగ్నీషియం సమపాళ్ళలోవుంటే జ్ఞాపక శక్తి పెరగడంతోపాటు నేర్చుకోవాలనే ఆకాంక్ష మరింతగా పెరుగుతుంది.

మనిషిలో తగ్గుతున్న జ్ఞాపక శక్తికి సంబంధించి చైనాకు చెందిన పేయిచింగ్లోని సింగహువా విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ లెర్నింగ్ అండ్ మెమొరీ ఫర్ సెంటర్డైరెక్టర్ ప్రొఫెసర్ గుఓసోంగ్ లియూ నాయకత్వంలో ఎలుకలమీద పరిశోధనలు జరిపినట్లు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పత్రిక న్యూరాన్ తెలిపింది.

జ్ఞాపక శక్తికి సంబంధించినంత వరకు ఎలుకల మీద పరిశోధనలు జరిపితే తెలిసి విషయాలేంటంటే వాటికిచ్చే ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని, దీంతో వాటిలో జ్ఞాపక శక్తి మరింతగా పెరిగిందని డైరెక్టర్ గుఓసోంగ్ లియూ పేర్కొన్నారు. అదే శరీరంలో మెగ్నీషియం తగ్గితే ప్రభావం జ్ఞాపక శక్తిపై తీవ్రంగా ఉంటోందని ఆయన తెలిపారు. దీంతో వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గిపోతుందన్నారు.

మనిషి శరీరంలోనున్న మెదడుతోపాటు ఇతర భాగాలకు మంచి పట్టు, దృఢత్వం కలుగజేసేందుకుగాను మెగ్నీషియం చాలా అవసరమంటున్నారు లియూ. తాము పరిశోధనలు చేసిన ఎలుకలలోని మెదడులో

మెగ్నీషియం శాతం పెరగడంతో వాటిలో జ్ఞాపక శక్తి పెరగడంతోపాటు తెలుసుకోవాలనే కోరిక బలీయంగా పెరిగినట్లు ఆయన వివరించారు. మనిషి తీసుకునే ఆహారంలో తరచూ మెగ్నీషియం ఉండేలా చూసుకుంటే వారిలోనున్న జ్ఞాపక శక్తి ఎప్పటికీ తరగదంటున్నారు లియూ.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
Top of Form


Bottom of Form
అతిగా మద్యాన్ని సేవించటం అనర్థదాయకం. విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అతితాగుడు మూలంగా సదరు వ్యక్తుల జ్ఞాపక శక్తి తగ్గిపోతుందట. మెదడులోని కణాలు స్టిరాయిడ్లను విడుదల చేసి దీర్ఘకాలంలో జ్ఞాపక శక్తిని తగిస్తాయని శాస్త్రవేత్తలు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. వాషింగ్టన్యూనివర్సిటీలోని స్కూల్ఆఫ్మెడిసిన్కు చెందిన శాస్త్రవేత్తలు ఛార్లెస్జోరుమ్స్కీ ఆధ్వర్యంలోని బృందం జరిపిన...
Source : Webdunia | 11 రోజుల క్రితం
Category : Health
గవంతుడు ధర్మరక్షణ కోసం ఎన్ని విధాలుగా అవతరిస్తాడనే విషయాన్ని కూడా పురాణ వాంజ్ఞయం వివరిస్తుంది. దేశ, కాల పరిస్థితులను బట్టి ధర్మస్థాపన కోసం ఎంత శక్తి అవసరమో అంత శక్తితోనే అవతరించి, అంత శక్తిని మాత్రమే వినియోగించి భగవంతుడు లోకాన్ని ఉద్ధరిస్తుంటాడు. అప్పుడు ఉపయోగించే శక్తి తారతమ్యాన్ని బట్టి అవతారాలు ఆరు విధాలుగా ఉంటాయని పెద్దలు నిర్ణయించారు. అంశావతారం, అంశాంశ అవతారం, ఆవేశ అవతారం, కలావతారం, పూర్ణావతారం,..

జ్ఞాపక శక్తి వృద్ధికి శిక్షణ తరగతులు

April 9th, 2011
హైదరాబాద్, ఏప్రిల్ 8: జాపక శక్తి పెంపొందించేందుకుస్మార్ట్ స్టడీ అండ్ క్రియేటివ్ మెమోరీ స్కిల్ వర్క్షాప్పేరుతో వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు జయసింహ ఒక ప్రకటనలో తెలిపారు. జ్ఞాపక శక్తి పెంపొందించడానికి, మానసిక వికాసం సాధించడానకి ఎన్నో నూతన పద్ధతులను స్క్వాడ్రన్ లీడర్ జయసింహ ఆవిష్కరించారు. తను కనుగొన్న త్రీ-డైమెన్షనల్ మెమోరీ సిస్టమ్ ద్వారా ఈయన ఎనిమిది సార్లు గిన్నిస్ రికార్డులు సాధించారు. దేశ, విదేశాలలో ఎన్నో శిక్షణ తరగతులు నిర్వహించిన ఆయన వేసవిలో 6-10 తరగతుల విద్యార్థులకు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సులభంగా పరీక్షలు రాయడం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఇంటర్మీడియెట్, బిఎస్సీ విద్యార్థులకు కెమిస్ట్రీ, లెక్కలు వంటి విషయాల్లో సులభ పద్ధతుల్లో గుర్తుంచుకోవడంపై శిక్షణ ఇవ్వనున్నారు. అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

హైపర్ టెన్షన్... తగ్గేదెలా?
మా కొడుకు, కోడలు ఉద్యోగస్తులు. అన్నింటికీ ఆందోళన పడటం, బీపీ తెచ్చుకోవడంతో ఇద్దరూ మందులు వాడవలసి వస్తోంది. రాత్రుళ్లు సరిగా నిద్రపోతున్నట్లు కూడా అనిపించదు. వారిని చూస్తే నాకు చాలా బాధ కలుగుతోంది. వయసులోనే వారికి హైపర్ టెన్షన్. దయచేసి వారి ఒత్తిడిని పోగొట్టుకునే మార్గాలు చెబుతారని ఆశిస్తున్నాను.

ఇప్పుడు ఆదాయం పెరుగుతున్న కొద్దీ హడావుడి కూడా పెరుగుతోంది. ఫలితంగా ఇంచుమించు ప్రతి ఒక్కరిలోనూ ఒత్తిడి కలుగుతోంది. దీని కారణంగా వచ్చే సర్వసాధారణ సమస్య హైపర్టెన్షన్. అధిక ఒత్తిడి గురించి అందరికీ బాగా తెలిసిందే. ఉదయాన్నే లేస్తారు. కాని పనులు సమయానికి పూర్తిచేసుకోరు. ఫలితంగా పనులు సకాలంలో పూర్తిచెయ్యగలమా లేదా అనే ఆందోళన వల్ల పనులు మరింత ఆలస్యమవుతాయి. ఆఫీసుకెళ్లిన తరవాత ఉద్యోగం గురించిన ఆలోచనలు, సామర్థ్యంతో పని చేస్తున్నామా లేదా అనే ఆందోళన, ప్రమోషన్ వస్తుందా లేదా అనే ఆతృత, పై అధికారుల చిటపటలు... ఇవన్నీ హైపర్టెన్షన్కి కారణాలు. వీటిని పోగొట్టుకోవడం అంత తేలిక కాకున్నా, కొన్ని సూచనలను పాటిస్తే కొంతవరకు పోగొట్టుకోవచ్చు.

వ్యాయామం: వ్యాయామం వల్ల శరీరంలోని ఎండార్ఫిన్లు బయటకు విడుదలయి ఉల్లాసం, ఉత్సాహం కలుగుతాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మెదడులో దాగి ఉన్న అనవసరమైన ఆలోచనలన్నీ బయటకు పోతాయి. ఫలితంగా మనసు తేలికపడుతుంది. ఎప్పుడైతే మెదడు ఉత్తేజితంగా ఉంటుందో, అప్పుడు చకచకా పనులు చేయగలగడమే కాక ఒత్తిడి దూరం అవుతుంది.

రోజూ కనీసం అరగంటసేపు వాకింగ్ చేయడం ప్రారంభించాలి. తరవాత దానిని 45 నిముషాలకు, ఆతరవాత గంటకు పెంచాలి. దీనితోపాటు యోగా. వీటికితోడు రెండు మూడు రకాల ఎక్సర్సైజులు చేస్తుండాలి.

నియమిత ఆహారం: ఆహారం తీసుకోవలసిన సమయాన్ని వాయిదా వేయడం మంచిది కాదు. ఇలా చేయడం వలన బ్లడ్ సుగర్ లెవల్స్ తగ్గుతాయి. అందువల్ల మెటబాలిజమ్ రేటు తక్కువ కావడమే కాకుండా, శరీరంలోని అన్ని వ్యవస్థలూ పనిచేయడం మానేస్తాయి. దాంతో ఆలోచనా విధానం సరిగా ఉండదు. ఆకలితో అలాగే ఉండిపోవడం వలన ఒత్తిడి అధికం అవుతుంది. అందుకనే ఉదయాన్నే ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలి. బేకరీ ఫుడ్ను పూర్తిగా నిషేధించాలి. ఎందుకంటే వీటిలో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. అంతేకాక ఫైబర్లు, న్యూట్రియంట్లు అస్సలు ఉండవు. ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని రోజు మొత్తం మీద కొద్దికొద్దిగా తీసుకోవాలి. ఇలా చేయడం వలన బ్లడ్ సుగర్ లెవల్స్ సక్రమంగా ఉంటాయి.


ధ్యానం: ప్రతిరోజూ కనీసం 20 నిముషాల సేపు ధ్యానం చేయటం వలన మానసికంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇందుకోసం ఒక నియమిత సమయాన్ని నిర్ణయించుకుని, సమయంలో మాత్రమే చేయాలి. ఇలా చేయడం వలన మెదడు సక్రమంగా పనిచేసి, రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. ధ్యానం చేయడానికి ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంచుకోవాలి. సుఖంగా కూర్చుని, దీర్ఘ ఉచ్ఛ్వాస, నిశ్వాసలు తీస్తూ శ్వాసమీదే ధ్యాసను నిలపాలి. రోజూ కనీసం ఆరు లేదా ఏడు గంటల పాటు హాయిగా నిద్రపోవాలి.

 
మంచి అలవాట్లు: ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను మానుకోవాలి. ఇవి మెదడు, శరీరం మీద ప్రభావం చూపుతాయి. ఒకవేళ అలవాట్లను మానలేకపోతే నిపుణుల సహాయం తీసుకుంటే మంచిది.

వ్యాధులు: రకమైన వ్యాధులు వచ్చినా వాటిని ఎప్పటికప్పుడు నియంత్రించుకుంటూండాలి. ఎందుకంటే వాటిని తగ్గించుకోకపోవడం వలన శరీరానికి ఇబ్బందీ కలగకపోయినా ఆర్థిక పరమైన ఇబ్బందులు కలుగుతాయి.
వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మీరు వారికి నచ్చజెపితే ఒత్తిడిని దూరం చేయవచ్చు.                                                                                                               :)Your's Shiva

No comments:

Post a Comment